love - Break up
-
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్‌లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్‌షిప్‌లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు. -
రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
సాక్షి, కొత్తగూడెంటౌన్ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది. తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం రాత్రి పాయిజన్ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా.. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
సాక్షి, ఖమ్మం(కొత్తగూడెం) : ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిపై చర్య తీసుకోవాలని ఓ ప్రియురాలు లక్ష్మీదేవిపల్లి మం డలం అనిశెట్టిపల్లి పంచాయతీ మాలగూడెంలో మంగళవారం దీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బర్మాక్యాంపునకు చెందిన అంగూరు శిరీష అనే యువతి పులిపాటి పారామెడికల్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. మాలగూడేనికి చెందిన కాకెల్లి దిలీప్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని, ఇంటి నుంచి వచ్చేయమంటూ తీసుకెళ్లాడని శిరీష వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిని పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లడం సరికాదని, పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు దిలీప్‌ను నిలదీయగా ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ప్రియురాలు శిరీష కిద్ది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని న్యాయం చేయాలంటూ దిలీప్ ఇంటి వద్ద మంగళవారం దీక్షకు పూనుకుంది. శిరీష దీక్ష చేస్తున్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్ బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపారు. -
'శింబు నిజస్వరూపం తెలిసింది'
శింబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమలోని పలువురు హెచ్చరించినా పట్టించుకోకుండా ప్రేమించానని, ఇప్పుడాయన నిజ స్వరూపం తెలిందని నటి హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. శింబు, హన్సిక ప్రేమించుకుంటున్నారని వెల్లడించగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నటి కుష్బూ, సిమ్రాన్ వంటి సీనియర్ తారామణులు శింబు ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త అంటూ హన్సికను హెచ్చరించారు. అయినా తాము ప్రేమలో పడ్డామని, పెళ్లి కూడా చేసుకుంటామని ఈ జంట ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం వీరి లవ్ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. దీనికి కారణం నటి నయనతారనే ప్రచారం వేడెక్కిస్తోంది. నటి నయనతార, శింబు మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన నయనతారకు ఆ ప్రేమ విషాదాన్నే మిగిల్చింది. ప్రస్తుతం ఒం టరిగా జీవిస్తూ చిత్రాలపై దృష్టి సారిస్తున్న ఈ సంచలన నటి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకను కేరళలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది. ఈ సందర్భంగా ఫోన్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన శింబు తన చిత్రంలో నటిస్తావా అని అడిగారట. మారుమాట లేకుండా నయనతార ఓకే చెప్పేసిందట. శింబు నిర్మిస్తూ నటిస్తున్నఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విష యం చెవిన పడ్డ హన్సిక దిగ్భ్రాంతి చెందిందట. శింబు నయనతార సరసన నటించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హన్సిక ఆయన్ని ప్రేమించి పెద్ద తప్పు చేశానని బాధపడుతోందట. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం శింబుతో హన్సిక ప్రేమ శకం ముగిసిందని అంటున్నారు.