ఆ అమ్మాయికి.. పెళ్లి చేశారు
* ప్రేమికుడితోనే అత్యాచార బాధితురాలికి పెళ్లి
* పట్టుబడ్డ ఇద్దరు నిందితులకు రిమాండ్
వేమూరు: ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు పంటపొలాల్లో శనివారం వేకువజామున అత్యాచారానికి గురైన యువతికి ప్రేమికుడితోనే పెద్దలు పెళ్లి చేశారు. పోలీసులమంటూ ప్రేమజంటపై నలుగురు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.దీంతో విషయం తెలుసుకున్న ప్రేమజంట కుటుంబసభ్యులు ఆదివారం ఉదయ రూరల్ పోలీస్స్టేషనుకు చేరుకున్నారు.
గాయపడ్డ రాజేష్ వ్యవసాయ పనులకు వెళుతుంటాడు. అతడు ప్రేమించిన యువతికి తల్లిదండ్రులు లేరు. అమ్మాయికి అన్యాయం జరగకుండా పెళ్లిచేసుకోవాలన్న బంధువులు, సంఘపెద్దల సూచనను రాజేష్, అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. పెళ్లికి అవసరమైన దుస్తులు, ఇతర సామగ్రిని ఎంపీపీ డాక్టర్ మధుసూదన్ సమకూర్చారు. సాయంత్రం కొల్లూరులోని పెద్దచర్చిలో వీరి వివాహం జరిగింది. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురిలో అదుపులో ఉన్న ఇద్దరిని శనివారంరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించారు. పట్టుబడినవారిలో రాతంశెట్టి సుధాకర్ (39), అడుసుమల్లి వెంకటేశ్వరరావు(26) ఉన్నారు. సుధాకర్ ఢిల్లీలో సైనికుడిగా విధలు నిర్వర్తిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.