lover fraud
-
ప్రేమ పేరుతో మోసం.. రెండోసారి గర్భం దాల్చడంతో పెళ్లి.. ఆపై
చిత్తూరు కార్పొరేషన్: తొలుత ప్రేమపేరుతో తల్లిని చేసి తర్వాత పెళ్లిపేరుతో నాటకమాడి పరారయ్యాడని దళితయువతి మౌనిక (21) కన్నీటిపర్యంతమైంది. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూతలపట్టు మండలం మద్దలయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక ఏడాది కిందట బంగారుపాళ్యంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్ పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో కలిసి తిరిగారు. మౌనిక గర్భం దాల్చడంతో వినోద్ మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో వీరి ప్రేమ వ్యవహారం బాధితురాలి ఇంట్లో తెలిసింది. వారి కుటుంబసభ్యులు నిలదీయగా ఈ ఏప్రిల్ 17వ తేదీన బంగారుపాళ్యం మండలం నలగలంపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వారం పాటు మౌనిక ఇంటికొచ్చి ఉండి.. తర్వాత పనికి వెళ్తానని చెప్పి వినోద్ పరారయ్యాడు. ఈ క్రమంలో మౌనిక జూన్ 4వ తేదీన ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డతో వినోద్ ఇంటికి వెళ్తే.. అత్తామామలు రానివ్వలేదు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం కలిసి ఉందామంటే అతడు నిరాకరించడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో దుగ్యాల ఐశ్వర్య (20) నివసిస్తుండేది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండేది. అయితే కొంతకాలం కిందట మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆశిర్ గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన ఐశ్వర్యను హైదరాబాద్ శివారులోని సంఘీ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అయితే ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏ పనీ చేయని ఆశిర్ రెడ్డి నిన్ను పోషించలేడు అని ఐశ్వర్యను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. తన భర్తను దూరం చేశారని ఐశ్యర్య అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. దీంతో హైదరాబాద్‌కు వచ్చి వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే తాను కుటుంబసభ్యులను ఒప్పిస్తానని నమ్మ బలికిన ఆశిర్ ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్‌కు చెప్పి కలిసి ఉందామని విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయం ఆశిర్ దాటవేస్తూ వస్తున్నాడు. ఆమె ఒత్తిడి చేస్తుండడంతో ‘నాకు కొంత సమయం కావాలి’ అని ఆశిర్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఆమెకు గర్భం తీసి వేయించాడు (అబార్షన్). ఆశిర్‌తో ఎలాగైనా తేల్చుకోవాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ కుటుంబసభ్యులు ఐశ్వర్యను దారుణంగా అవమానించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. కొన్ని రోజులుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్- 3లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో నివసిస్తోంది. ఆ మనస్తాపంతోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు కొన్ని సెల్ఫీ వీడియోలను ఐశ్వర్య తీసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆశిర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నన్ను క్షమించండి అమ్మా.. నాన్న! నేను ప్రేమించిన రంజిత్ పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు.. నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని అంటూ బెదిరిస్తూ మానసికంగా నాకు నరకం చూపుతున్నాడు.. అమ్మా.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను హ్యాపీగా ఉండనివ్వడు.. నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేవడం నాకు ఇష్టం లేదు.. నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు.. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్‌బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్.. మిస్‌యూ మై ఫ్యావిులీ.. మిస్ మై మామ్.. డాడ్.. అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి, గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజులకు మృతిచెందింది. సారంగాపూర్ ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) రెండేళ్ల కిందట సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియట్ పూర్తి చేసింది. ఇంటర్లో తన క్లాస్మేట్ అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్(19)తో పరిచయం ఏర్ప డి, ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయ్యేవరకు వారి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఉమ రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతోంది. ఈ క్రమంలో కొన్ని కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఉమ రంజిత్‌ను కోరుతోంది. అతను అంగీకరించకుండా పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి కొత్తపల్లి లక్ష్మి, తండ్రి సత్తయ్యలకు తెలిపింది. ఇద్దరి కులాలు వేరైనా తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వారు రంజిత్‌ను ప్రాధేయపడ్డారు. కానీ అతను వినలేదు. దీంతో బాధిత కుటుంబీకులు ఉమకు వివాహం చేయాలని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్ వాటిని చెడగొడుతూ ఉమకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కుటుంబీకులు మృతదేహంతో ఇంటికి వచ్చారు. ఇంట్లో మృతురాలి అక్కలకు ఉమ రాసిన సూసైట్ నోట్ దొరికింది. ఎస్సై రాజన్న మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి పంపించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫి ర్యాదు మేరకు రంజిత్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రియుడి చేతిలో మోసపోయి..!
రాయచోటి: ఆమెను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తీసుకొచ్చి మధ్యలోనే వదిలేశాడు. అటు ఇంటికి వెళ్లలేక.. ఇటు బయట ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులకు పట్టుబడింది. ఆమె దయనీయ గాథను తెలుసుకున్న పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అక్కడి కృషి నగర్‌కు చెందిన మహేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఈ ఊరిలో ఉంటే మనల్ని పెళ్లి చేసుకోనీయరని నమ్మించి 2013వ సంవత్సరంలో ఆమెతో సహా కడపకు వచ్చాడు. అక్కడి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టి మళ్లీ వస్తానని చెప్పి పారిపోయాడు. ఈ పరిస్థితిలో పరువు పోతుందని ఆమె ఇంటికి వెళ్లలేకపోయింది. ఆమె తండ్రి, సోదరులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. అప్పటినుంచీ అటు పోలీసులతో పాటు ఇటు కుటుంబసభ్యులు కూడా వెతికి ఫలితం లేదని వదిలేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ లో మునీరు అనే మహిళతో ఆ యువతికి అపట్లో పరిచయమైంది. తనతో వస్తే జీవనోపాధి చూపిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలోకి దింపింది. శుక్రవారం రాత్రి ఆమె రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది. వృభిచార గృహ నిర్వాహకురాలు మునీరులో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతి ఫ్యామిలీకి సమాచారం అందించడంతో ఆమె సోదరులు శనివారం రాయచోటికి వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత తమ సోదరి కనిపించిందని వారు ఎంతో సంతోషించారు. అయితే ఇలా వ్యభిచార గృహంలో పోలీసుల చేతికి చిక్కడం వారికి ఒకింత బాధ కలిగించింది.