lucky deep
-
జనాభా దినోత్సవం సందర్భంగా లక్కీడిప్
సంగారెడ్డి టౌన్ : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక బిడ్డ, ఇద్దరు ఆడ పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిం చుకున్న వారిని ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తన చాంబర్లో లక్కీడిప్ తీశారు. ఒకే బిడ్డ గల జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, రాములు దంపతులు, పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన వి.కళావతి, శేఖర్ దంపతులు లక్కీడిప్‌లో గెలుపొందారు. వీరికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున బహుమతి ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్, డాక్టర్ గాయత్రీదేవి, డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. నేడు ర్యాలీ.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్ తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభిస్తారని, అనంతరం కార్యాలయంలో సమావేశం ఉంటుందని వివరించారు. -
శ్రీవారి ఆర్జిత సేవల లక్కీడిప్ కోటా విడుదల
తిరుమల: తిరుమలలో లక్కీడిప్ కింద శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై కోటా గురువారం టీటీడీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. ఆర్జిత సేవలకు ముందు రోజు సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో)లోని విజయాబ్యాంక్ కౌంటర్లో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులు తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్ నంబర్ కంప్యూటర్లో నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. నమోదు చేసుకున్నవారిలో కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుడి సెల్ నంబరుకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం అందజేస్తారు. రాత్రి 8 గంటల్లోపు ఆ టికెట్టు కొనుగోలు చేయాలి. శుక్రవారం నిర్వహించే పురాభిషేకం, మేల్చాట్ వస్త్రం టికెట్లను రెండో విడత లక్కీడిప్‌లో కేటాయిస్తారు. వీటిని రాత్రి 10 గంటల్లోపు భక్తులు పొందవచ్చు. జూలై లక్కీడిప్ కోటా వివరాలు తోమాల అర్చన వస్త్రం పూరాభిషేకం 04.07.2017 05 10 – – 05.07.2017 01 13 – – 06.07.2017 03 13 – – 07.07.2017 – – 02 12 11.07.2017 – – – – 12.07.2017 18 19 – – 13.07.2017 20 16 – – 14.07.2017 – – 02 04 18.07.2017 0 10 – – 19.07.2017 15 09 – – 20.07.2017 12 11 – – 21.07.2017 – – 02 08 25.07.2017 0 09 – – 26.07.2017 01 15 – – 27.07.2017 23 15 – – 28.07.2017 – – 02 10