ఓ ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని..
రియో డి జెనిరో: ఎత్తైన కొండ అంచు. మూడొందల అడుగుల కింద సముద్రం. ఆ కొండ అంచునుంచి కేవలం కాళ్ల సహాయంతో తలకిందులుగా వేలాడాడు ఓ వ్యక్తి. ఆ సాహసం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచాల్సిదే. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌లోని రియో డి జెనీరోకు చెందిన 27 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ చేసిన సాహసం ఇప్పుడు అందరిచే ఔరా అనిపిస్తుంది.
లుయీజ్ ఫెర్నాండో క్యాండియా రియో డిజెనీరో లోని ఓ కొండ అంచునుంచి వేలాడిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఉంచిన ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని లుయీజ్ ఈ సాహసం చేయడం విశేషం. తన మిత్రుడి సహాయంతో తాడుతో ముందుగా కొండ అంచుకు చేరుకున్న లూయీజ్.. కాళ్ల సపోర్ట్‌తోనే వేలాడి ఫోటోలకు పోజిచ్చాడు. అనంతరం మళ్లీ తన మిత్రుడి సహాయంతో కొండపైకి చేరుకున్నట్లు లూయీజ్ తెలిపాడు. అతడి సాహసం, ఫిట్‌నెస్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి.
స్పూర్తినిచ్చిన ఫేక్ ఫోటో