మతం మార్చుకోనన్నాడని ప్రియుడిపై యాసిడ్ దాడి..
బెంగళూరు: బెంగళూరులో ఓ యువతి ప్రేమికుడిపై యాసిడ్ చేసిన ఘటన కలకలం రేపింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ దాడికి దిగింది. పథకం ప్రకారం అతణ్ని వెంబడించి మరీ ముఖంపై యాసిడ్ పోసి బ్లేడ తో దాడిచేసి పరారయ్యింది.
వివరాల్లోకి వెళితే శ్రీరాంపురా లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లిడియా (26) జయకుమార్ (32)గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహంచేసుకోవాలని అడుగుతూ వచ్చింది లిడియా. అలాగే క్రైస్తవంలోకి మతం మార్చుకోవాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినా మతం మార్చుకునేందుకు మత్రం నిరాకరించాడు కుమార్. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో గత నవంబర్ నుంచి జయకుమార్ ఆమె ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేసాడు. దీంతో లిడియా ప్రియుడిపై పగ పెంచుకుంది. ఎలాగైనా దెబ్బకొట్టాలనుకుంది. దీనికి కజిన్ సునీల్ సాయం తీసుకుని జయ కుమార్ కదలికలపై కన్నేసింది.
జయకుమార్, స్నేహితుడుతో పద్మనాభ రాజరాజేశ్వరి ఆలయానికి వెళుతున్న సమాచారాన్ని తెలసుకుంది. లిడియా, సునీల్ ఇద్దరూ స్కూటర్ మీద మార్గమధ్యలో అతని కోసం కాపు కాచారు. దర్శనం అనంతరం తిరిగి కారులో వస్తున్న జమకుమార్ పై దాడిచేసింది. అట్టిగుప్పబస్సు స్టాప్ దగ్గర వారికిని అటకాయించి..జయకుమార్ ముఖంపై యాసిడ్ పోసింది. బాధతో విలవిల్లాడుతూ కారునుంచి బయటికి వచ్చిన అతనిపై బ్లేడుతో ఎదురుచూస్తున్న లిడియా దాడిచేసి ఉడాయించింది. తీవ్రంగా గాయపడిని కుమార్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించాడు.
కేసు నమోదుచేసిన పోలీసులు ఐపీసీ 326ఎ, 307 ఇతర సెక్షన్ల కింద లిడియాను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.