టీసీఎస్ సీఈవోగా మళ్లీ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవోగా ఎం. చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు (2019, అక్టోబర్) పొడిగిస్తున్నామని టీసీఎస్ బుధవారం తెలిపింది. ఆయన నేతృత్వంలో తమ కంపెనీ మంచి వృద్ధిని సాధిస్తోందని పేర్కొంది.
ఆయన సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్వార్టర్లో (2009-10 జూలై-సెప్టెంబర్) రూ.29,091 కోట్లుగా ఉన్న కంపెనీ రాబడులు ఈ ఏడాది జూన్ చివరి నాటికి రూ.85,933 కోట్లకు పెరిగాయని వివరించింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ.4.97 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. తమ కంపెనీ 24 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోందని, ఐటీ పరిశ్రమలో ఇదే అధికమని టీసీఎస్ వివరించింది.