ఇద్దరు గల్లంతు
మాడుగుల, న్యూస్‌లైన్: వర్షాలకు జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు ధ్రువీకరించారు. తాచేరు నదిలో పడి గురువారం సాయంత్రం మహిళ కనిపిం చకుండాపోయింది. ఎం.కోడూరు గ్రామానికి చెందిన జాజిమొగ్గల ఆదిలక్ష్మి (35) నది ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లింది. నీటి ఉధృతికి గల్లంతయింది. ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్నితహశీల్దార్ పి.రామునాయుడు పరిశీలించారు. కాగా విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టర్-2లోని చాకలిగెడ్డలో బంగారమ్మ(70) కొట్టుకుపోయింది.
మరుపాకలో నీట మునిగి ఒకరు...
రావికమతం : మరుపాకలో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. గురువారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్న దాలిబోయిన సన్నిబాబు(58) గెడ్డదాటబోయి అందులో మునిగిపోయాడు. అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఆయాసంతో ఇంటికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు.