కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
రాయచూరు : కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని జనతాదళ్(ఎస్) తాలూకా అధ్యక్షుడు ఎం.లింగప్ప ధడేసూగూరు పేర్కొన్నారు. కేపీసీసీ వెనుకబడిన వర్గాల రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కే.కరియప్ప కుమారస్వామి గురించి చులకనగా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారి స్నేహితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే వాచ్‌ని కానుకగా తీసుకోవడంపై కుమార స్వామి ప్రశ్నించడం తప్పు కాదన్నారు. కుమారస్వామి ఎన్నో కుంభకోణాలు వెలికి తీశారని ఆయన గుర్తు చేశారు. కరియప్ప మాత్రం విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య వాచ్ విషయం తప్ప కుమారస్వామికి వేరే పని లేదని, కుమారస్వామి కూడా కార్లు, సైట్లు తీసుకున్నట్లు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదన్నారు.తాలూకా జేడీఎస్ ఉపాధ్యక్షుడు మహిబూబ్ పాషా, జేడీఎస్ నేత ధర్మనగౌడలు విలేకరుల సమావేశంలో ఉన్నారు.