M. Veerappa Moily
-
గ్యాస్ తో ఆధార్ లింక్ తెగింది
నగదు బదిలీ పథకంతో భాగంగా ఆధార్ కార్డుతో ఉన్న సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ల లింక్ ను తొలగించాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటి నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆధార్ తో ఉన్న ఎల్ పీజీ సబ్బిడీ బదిలీ పథకాన్ని నిలిపివేశామని పెట్రోలియ శాఖ మంత్రి ఎమ్ వీరప్ప మెయిలీ తెలిపారు. మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసిన వంటగ్యాస్ పై సబ్సిడీని బ్యాంక్ అకౌంట్ల ద్వారా వినియోగదారులకు బదిలీ చేస్తున్న విషయం తెలిపిందే. 18 రాష్ట్రాల్లో 289 జిల్లాల్లో కొనసాగుతున్న ఈ నగదు బదిలీ పథకాన్ని నిలిపివేస్తున్నామని మొయిలీ వివరించారు. అ పథకంపై అనేక ఫిర్యాదులు కమిటీకి అందాయని.. ఆధార్ కార్డు వినియోగం అనేక సమస్యల్ని సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో చాలా మందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం అనేక సమస్యలకు కారణమవుతోంది అని మొయిలీ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి పెద్ద ఎత్తున వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో ప్రయాణించిన మొయిలీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం ఉదయం మెట్రోలో ఆఫీసుకు వెళ్లారు. ఇంధన పొదుపు ఆవశ్యకతకు కొత్త పద్ధతులను సూచించే మొయిలీ తుగ్గక్లేన్లోని తన నివాసం నుంచి నడిచి వచ్చి ఉదయం 9.45 గంటలకు రేస్‌కోర్స్ మెట్రో స్టేషన్లో మెట్రో రైలు ఎక్కారు. పది నిమిషాలు సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లో దిగి శాస్త్రీభవన్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మీడియా, కెమెరా సిబ్బం ది వెంటరాగా ఆయన తన సిబ్బందితో కలిసి మెట్రో ఎక్కారు. రైలులో కేంద్ర మంత్రిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్లతో ఆయన ఫొటో తీసుకున్నా రు. నిలబడి ప్రయాణిస్తున్న మంత్రిని చూసి ఒక వ్యక్తి లేచి నిలబడి తన సీటు ఇచ్చారు. కానీ మొయిలీ వారి కోరికను సున్నితంగా తోసిపుచ్చి నిలబడే ప్రయాణించారు. ప్రయాణాన్ని అస్వాదించా: మొయిలీ మెట్రో ప్రయాణాన్ని అస్వాదించానని, సాధారణ రోజుల కన్నా త్వరగా కార్యాలయానికి చేరుకున్నామని ఆయన చెప్పారు. కనీసం ఒక రోజైనా రోడ్డుపైనున్న రద్దీలో నుంచి తాను విధులకు వెళ్లడం ఆనందంగా ఉందని విలేకరులతో చెప్పారు. ఇక నుంచి ప్రతి బుధవారం తాను ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. తన అధికార వాహనాన్ని గ్యారేజ్‌లో ఉంచాలని డ్రైవర్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. వారానికి కనీసం ఒక్కరోజైనా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని చమురురంగ ప్రభుత్వ సంస్థలను కోరతానన్నారు. ఒక్కరోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా పెట్రోలియం మంత్రిత్వశాఖ ఒక్కటే 40 వేల రూపాయల విలువైన 600 లీటర్ల పెట్రోలు, డీజిల్ ఆదా చేస్తుందని వీరప్ప మొయిలీ చెప్పారు. ఇంధన పొదుపు ఆవశ్యకత సందేశాన్ని అందిచడం కోసం తాను వారానికి ఒక రోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వారం ప్రారంభించిన ఇంధన ఆదా ప్రచార ఉద్యమంలో భాగంగా పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉద్యోగులు వారానికి ఒకరోజు ప్రజా రవాణా వ్యవస్థను స్వచ్ఛందంగా ఉపయోగించాలని నిర్ణయించారు. కాగా, పెట్రోలియం శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కూడా బుధవారం మెట్రో రైలు, బస్సులలో ఆఫీసుకు చేరుకున్నట్లు తెలిసింది. -
మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ బుధవారం మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లారు. పెట్రోలియం పొదపు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రేసు కోర్సు స్టేషన్ వద్ద రైలెక్కి సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద దిగారు. ఇక్కడికి సమీపంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఉంది. 'ప్రతీ బుధవారం నేను రైల్లోనే ఆఫీసుకు వెళతా. నా అధికారిక వాహనాన్ని గ్యారెజిలో ఉంచాల్సిందిగా సిబ్బందికి సూచించా. వారంలో కనీసం ఒకసారి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణం చేయాల్సిందిగా పెట్రోలియం శాఖ పరిధిలోని కంపెనీల ఉద్యోగులకు సలహా ఇచ్చా' అని మంత్రి చెప్పారు. పెట్రోల్‌ను పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఆదా చేసినట్టేనని అన్నారు.