‘జిల్లాకొక పాస్‌పోర్టు సేవా కేంద్రం’
వరంగల్: విద్యార్థులు, ఇతర రంగాల ప్రజలకు సేవలందించేందుకు త్వరలోనే ప్రతి జిల్లాలో ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ డిప్యూటీ రీజినల్ పాస్‌పోర్టు అధికారి మదన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 29న మహబూబ్‌నగర్ జిల్లాలో పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు మేళాకు 1,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో 700 మంది నిట్ విద్యార్థులకు సంబంధించినవని చెప్పారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి వెరిఫికేషన్‌కు పంపిస్తున్నామన్నారు.