madhavaram krishnarao
-
‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’
సాక్షి,కూకట్పల్లి(హైదరాబాద్): పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. పింఛన్ డబ్బుల్లో రూ.1900 కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 మాత్రమే ఇస్తుందన్నారు. అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అయినా ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుందని బీజేపీ నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నేడు తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపైనా ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని వెంకట్రావునగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచే అధికారులు సోదాలు చేసారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్‌రావు డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రణీత్ హోమ్స్ కంపెనీ కార్యాలయాలతోపాటు,ఎండీ నరేందర్, మరో ఐదుమంది డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ రోజు అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
టీడీపీలో మరో వికెట్ డౌన్
-
టీడీపీలో మరో వికెట్ డౌన్
హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌస్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ లో ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణారావు మాత్రం ఆయనకు అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడీపీ సమావేశానికి కూడా కృష్ణారావు హాజరు కాలేదు. సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది.