రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌వాసి మృతి
నిజమాబాద్: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ శివారులో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మధుకుమార్ (28) అనే వ్యక్తి మరణించారు. భిక్కనూరు ఎస్సై రాంబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మధుకుమార్ తన స్నేహితులు రాంకుమార్, శ్రీరామ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డిలతో కలిసి కారులో నిజామాబాద్ వచ్చాడు. ఆదివారం నిజామాబాద్‌లో స్నేహితుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. వీరి వాహనం బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకుమార్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న రాంకుమార్, శ్రీరామ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.