Madhura sridhar Reddy
-
కేసీఆర్... కబ్ ఆయేగా ఆప్?
కమర్షియల్ సిన్మాకు కావలసిన ముడి సరుకులన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జీవిత కథలో ఉన్నాయి. ఈ ముడి సరుకుల్ని మాంచి మిక్చర్ పొట్లంగా కట్టే నేర్పు కావాలంతే! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎపిసోడ్ అయితే సిల్వర్‌స్క్రీన్‌పై గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ. అందుకే, కేసీఆర్ జీవిత కథ తెలుగు దర్శక–నిర్మాతలను ఎట్రాక్ట్ చేసింది. అలా ఎట్రాక్ట్ అయినవాళ్లలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి ఒకరు. కథపై కొన్ని రోజులు కసరత్తులు కూడా చేశారు. కేసీఆర్‌గా హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాగుంటాడని అతడితో చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్ టాక్! ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి కాకుండా... తెలంగాణ సాయుధ పోరాటంపై ‘బందూక్’ సినిమా తీసిన దర్శకుడు లక్ష్మణ్ కేసీఆర్ బయోపిక్ మొదలుపెట్టారు. ‘‘అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడిన కేసీఆర్ జీవిత ప్రస్థానమే ‘గులాల్’ చిత్రకథ’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇవే కాకుండా... మరికొన్ని బయోపిక్స్ కూడా తెలుగులో రెడీ అవుతున్నాయట!! -
కేసీఆర్ బయోపిక్ రెడీ అవుతోంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా క్రీడాకారుల జీవిత కథలతో సినిమాలు తెరకెక్కుతున్నా అడపాదడపా ఇతర రంగాల వారి మీద కూడా బయోపిక్స్ తెరకెక్కిస్తున్న మేకర్స్. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ జీవిత కథకు తెర రూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తుండగా పెళ్లిచూపులు ఫేం రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. తెలంగాణ కల సాకారమైన జూన్ 2న ఈ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మధుర శ్రీధర్ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా, తెలంగాణ ఉద్యమ సారథిగా, ముఖ్యమంత్రిగా కేసిఆర్ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను సినిమాలో ప్రస్థావించనున్నారు. -
'రోమియో' పోస్టర్ లాంఛ్