మహా ‘మాగ’.. ధర బాగా!
నాగాయలంక: సాధారణంగా కేజీ నుంచి ఐదు కేజీల బరువుండే ‘మాగ’ చేప ఏకంగా 30 కిలోలు తూగింది. ఇండియన్ సాల్మోన్ శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను తీరప్రాంతంలో ‘మాగ’గా పిలుస్తారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఓ చేపల కొనుగోలు కంపెనీలో శుక్రవారం ఈ చేప కనిపించింది.
సముద్రపు చేపలవేటలో ఈలచెట్లదిబ్బ మత్స్యకారులకు దొరికింది. ఈ చేప ఖరీదు కేజీ రూ.1300 పలికింది. అంటే రూ. 39 వేలు అన్నమాట.