పట్టపగలు దోపిడీ
జీడిమెట్ల, న్యూస్‌లైన్: పట్టపగలు దొంగలు బరి తెగించారు. కేబుల్ సిబ్బందిమంటూ ఓ ఇంట్లోకి చొరబడి.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడ కోసి, ఆరు తులాల బంగారు గాజులను దోచుకున్నారు. స్థానికంగా సంచలం సృష్టించిన ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీసాయి కాలనీలోని కూన కృష్ణ, మహాలక్ష్మి అపార్టుమెంట్ 3వ అంతస్తు ఫ్లాట్ నెం. 202లో తాయమ్మ(60), ఆమె కుమారుడు రాము ఉంటున్నారు.
శనివారం ఉదయం రాము విధులకు వెళ్లగా... ఇంట్లో తా యమ్మ ఒక్కరే ఉన్నారు. మధ్యాహ్నం 1.30కి కేబుల్ సిబ్బందిమంటూ ఇద్దరు వ్యకు ్తలు ఇం ట్లోకి వచ్చి టీవీ బాగు చేస్తున్నట్లుగా నటించా రు. వారి వెనుకే నిలబడి చూస్తున్న తాయమ్మపై ఒక్కసారిగా చాకుతో దాడి చేసి గొం తుపై నాలుగు సార్లు పొడిచారు. ఆపై మెడ కోసి ఆమె చేతికి ఉన్న రూ.1.50 లక్షలు విలువ చేసే నాలుగు బంగారు గాజులు (ఆరు తులా లు) లాక్కొని పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లే ముందు తలుపునకు బయట గడియ పెట్టారు.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చిన తాయమ్మ ఇంటి తలుపులను గట్టిగా కొట్టసాగింది. ఫ్లాట్ నెం. 201లో ఉండే పూజ అదే సమయంలో కాలేజీ నుంచి ఇంటికి వస్తూ తాయమ్మ చేస్తున్న శబ్ధాన్ని వింది. వెంటనే ఆమె గడియ తీసి చూడగా తాయమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అది రావడం ఆలస్యం కావడంతో ఆటోలోనే బాధితురాలని బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలించారు. తాయమ్మ మెడపై నాలుగు కత్తిపోట్లు ఉండటంతో డాక్టర్లు 48 గంటల పాటు పరిశీలన కోసం ఐసీయూలో ఉంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
తెలిసిన వారి పనే?
ఈ దోపిడీ తెలిసిన వారి పనే కావచ్చి పోలీసులు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, అపార్టుమెంట్లో నివాసముండే వారిలో కొందరు.. ఇద్దరు దుండగులను చూశామని చెప్తుండగా, మరికొందరు ముగ్గురు దుండగులను చూశామంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పని చేస్తున్న పలువురు కేబుల్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ సుదర్శన్ తెలిపారు.