తెలంగాణ సంస్కృతిని కాపాడాలి
నాందేవ్‌వాడ,న్యూస్‌లైన్ : తెలంగాణ సాంసృతీ, సంప్రదాయాలను కాపాడేందుకు జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ కృషిచేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య సేవా సమితి ఉపాధ్యక్షుడు మహంకాళి విజయ్ అన్నారు.నగరంలోని గాజులపేటలో నగరంలోని 50 డివిజన్లకు చెందిన మహిళలకు నగర వైశ్య భవన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ పోటీల విజేతలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మహాజన్ సుదర్శన్గుప్త, కార్యదర్శి విజయ్, కోశాధికారి కోటగిరి చంద్రప్రకాశ్, న్యాయనిర్ణేతలుగా పెద్దిజగదీశ్వర్గుప్త, కట్కం చిరంజీవిరావు, నారాయణ, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.