భద్రత దళాలు కాల్పులు: 10 మంది తీవ్రవాదులు మృతి
ఆఫ్ఘానిస్థాన్ గజని ప్రావెన్స్లోని జిలాన్ జిల్లాలో శనివారం భద్రత దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరి కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 10 మంది తీవ్రవాదులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రవాదులు గాయపడ్డారు. ఈ మేరకు జిలాన్ జిల్లా గవర్నర్ మహబూబ్ల్లా సబ్వాన్ వెల్లడించారు.
కాబూల్‌కు దక్షిణ భాగంలో 125 కిలోమీటర్ల దూరంలో ఆ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా భద్రత దళాలకు తీవ్రవాదులు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో భద్రత దళాలుపై తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై తీవ్రవాదులపై కాల్పులు జరిపారని తెలిపారు.