మహీన్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో మహీన్ నవాజ్ ఖాన్ సత్తా చాటింది. హైదరాబాద్ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ క్యాడెట్ బాలికల పూమ్సే వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడెట్ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధించింది.
పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తైక్వాండో సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె. సంపూర్ణం తదితరులు పాల్గొన్నారు.