జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
పెదమామిడిపల్లి (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లా జెడ్పీపీఠంతో పాటు అత్యధిక ఎంపీపీలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని దిగమర్రు, కొత్తపేట, పెదమామిడిపల్లి గ్రామాల్లో పోలింగ్ సర ళిని పరిశీలించారు. అనంతరం పెదమామిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలకొల్లు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలే దిక్సూచిగా నిలిచారని, వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునే సమయం కోసం ప్రజలు ఇన్నాళ్లూ వేచి చూసినట్టు శేషుబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్లోబల్ ప్రచారం చేశారని, ఆయితే ప్రజలు విశ్వసనీయతకు, మాట విలువకు ప్రాధాన్యతనిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌కి ఓటు వేశారన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ యాండ్ర గోపి, ఉప సర్పంచ్ యాండ్ర సత్యనారాయణ, పనమట పెద్దఅబ్బులు, కవురు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.