యాహూ.. పిట్ట చిక్కింది..!
ఆరేళ్ల కష్టం.. 4,200 గంటల నిరీక్షణ.. జీవిత కాల కోరిక.. ఎట్టకేలకు అతడి కల నెరవేరింది. స్కాట్లాండ్కు చెందిన మెక్ ఫేడెన్కు ఆరేళ్ల వయసు నుంచి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా కింగ్ఫిషర్ అనే పక్షి (లకుముకి పక్షి) నీటిలో మునుగుతుండగా ఫొటో తీయాలనేది అతని చిరకాల వాంఛ. అందుకే ఆరేళ్లుగా ప్రతిరోజూ ఆ పక్షి గూడు దగ్గరికి వెళ్లి వందలాది ఫొటోలు తీసేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 లక్షల 20 వేల ఫొటోలు తీశాడు. చివరికి అతడు అనుకున్నట్లు ఆ పక్షి తన కెమెరాకు చిక్కింది. ఇంకేముంది మనోడు ఎగిరి గంతేశాడని వేరే చెప్పాలా..?