ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
యండమూరి వీరేంద్రనాథ్
హన్మకొండ కల్చరల్ : సమాజంలోని ప్రజలు లక్ష్యసాధన కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ రచయిత, డైరెక్టర్, నంది అవార్డు గ్రహీత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేం ద్రనాథ్ అన్నారు.
హన్మకొండ అంబేద్కర్‌భవన్‌లో శనివారం సాయంత్రం మేథా లాంగ్వేజ్ థియేటర్ ప్రారంభోత్సవంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. మన విద్యార్థుల్లో జ్ఞానం ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్యం తక్కువ అని, ఇలాంటి వారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి లాంగ్వేజ్ థియేటర్ ఉపయోగపడుతుందన్నారు. చిరంజీవి ఎంతో కష్టపడి పైకొచ్చారని ఆయన జీవితం విద్యార్థులకు ఆదర్శమవుతుందని ‘నేనే నా ఆయుధం’ పుస్తకం రాసినట్లు తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన మనస్సులో ఉన్న భావాన్ని మాట, ఆలోచన తడబాటు లేకుండా క్లుప్తంగా వివరంగా చెప్పగలగడమేనన్నారు. ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్ అని అర్థం.. ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు నవ్వుతూ ఉండాలి.. రేపు కూడా నవ్వగలమనే విశ్వాçÜం ఉండాలన్నారు. మేథా లాంగ్వేజ్ థి యేటర్ డైరెక్టర్ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఎన్నో కష్టాలు పడ్డానని, వీరేంద్రనాథ్ ను కలిసిన తర్వాతనే తన జీవితంలో మార్పు వచ్చిందన్నారు. అనంతరం చిరంజీవి, అతడి సోదరులు వీరేంద్రనాథ్‌ను శాలువాతో సత్కరించి స్వర్ణకంకణధారణ చేశారు. కేయూ ఆం గ్లశాఖ ఆచార్యులు దామోదర్‌రావు, సాంబ య్య, సుధాకర్, సైకాలజిస్ట్ బరుపాటి గోపి, లాంగ్వేజ్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు.