Malavalli
-
విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. ఏమీ తెలియనట్లు నటన.. చివరికి!
సాక్షి, బెంగళూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని ఒక కామాంధుడు హత్యాచారం చేశాడు. మండ్య జిల్లా మళవళ్లి పట్టణంలో ఈ దారుణం జరిగింది. కాంతరాజు (52) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాలు.. మంగళవారం ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్యూషన్ చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సమీపంలో ఒక బేకరీ వద్ద నాగరాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలోని ఇంటి సంపులో బాలిక మృతదేహం ఉన్నట్లు తెలిసి అక్కడకు పరుగులు తీశారు. అది తమ కూతురిదేనని తెలిసి విలపించారు. ఏమీ తెలియనట్లు నటన ట్యూషన్లో పనిచేసే కాంతరాజు అనే వ్యక్తి పోలీసులతో పాటు తిరుగుతూ బాలిక ఆచూకీ కోసం వెతుకులాడినట్లు నటించాడు. బాలిక తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ట్యూషన్ వద్ద ఎవరో ముగ్గురు యువకులు ఉంటారని, వారిపై అనుమానం ఉందని చెప్పాడు. కాల్ రికార్డుతో దొరికిన కాంతరాజు కాంతరాజు చెప్పిన విషయాలు అబద్ధమని పోలీసులకు తెలిసింది. దీంతో అతనిపై అనుమానంతో ప్రశ్నించగా తనకేమి తెలియదని నమ్మబలికాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా బాధిత బాలికతో మాట్లాడిన కాల్ రికార్డు దొరికింది. స్కూల్ సెలవు కావడంతో ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు రావాలని అతడు బాలికకు చెప్పాడు. తరువాత బాలికను నిర్మాణంలోని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో చంపి సంపులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. -
ఘోరం: కారులోనే ముగ్గురు సజీవదహనం
మండ్య: రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కాగా, ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్ కైజల్ (45) కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. భార్య మెహక్(33), కుమార్తెలు షేక్ ఐహిల్ (6) మెహైరా (11), సుహాన (12)తో కలిసి ఓ పని నిమిత్తం జిల్లాలోని కొళ్లెగాల హనూరు వచ్చారు. శుక్రవారం ఉదయం బెంగళూరు బయల్దేరారు. హలగూరు భారతీయ పెట్రోల్ బంక్ వద్ద కారు నియంత్రణ తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. కారు నుంచి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. షేక్ కైజల్, సుహాన, షేక్ ఐహిల్ మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
-
తల్లీకూతుళ్లను నరికి చంపిన దుండగులు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లను దుండగులు గత అర్థరాత్రి దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనపై స్థానికులు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన మల్లవల్లి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు. దోపిడికి వచ్చిన వారే ఆ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.