Malavat Poorna
-
వీకెండ్ ఫోకస్.. వార్తల్లో వ్యక్తులు
బిపిన్ రావత్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశ రక్షణ రంగంలో కీలకమార్పు చోటుచేసుకుంది. దేశ రక్షణ బలగాల తొలి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్– సీడీఎస్)గా బిపిన్ రావత్ నియామకమయ్యారు. త్రివిధ రక్షణ బలగాల వ్యవహారాలకు బిపిన్ రావత్ ఇకపై బాధ్యత వహిస్తారు. జనవరి 1వ తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు ఈయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. మాలావత్ పూర్ణ ప్రపంచంలోనే చిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన ఘనతను సాధిం చిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థిని మాలావత్ పూర్ణ మరో సాహసాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డిసెంబర్ 26న అంటార్కిటికా ఖండంలో 16,050 అడుగుల ఎత్తైన విస్సన్ మసిఫ్ పర్వతంపై అడుగుమోపారు. ప్రపంచంలో ని ఎత్తైన ఏడు ఖండాల్లో ఆరింటిని అధిరోహించిన పూర్ణ.. ఇక ఉత్తర అమెరికాలోని ‘డెనాలీ’ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంది. మలాలా యూసఫ్ జా నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాని ‘‘మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ద వరల్డ్’’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికల విద్య కోసం గొంతెత్తి నినదించిన మలాలా, తాలిబన్ల అకృత్యాలను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు. అతిచిన్న వయస్సులోనే ప్రారంభించిన ఆమె ఉద్యమ సంకల్పాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. -
ఆర్థికసాయం చేయండి
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): ఆర్థికస్థోమత లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసం ఉంది. అందరిలో ఒకరిలా కాకుండా నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరో. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగడంతో గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. సాధించాలనే తపన, పట్టుదలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరోది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామం. తండ్రి అశోక్, తల్లి కంసమ్మ రోజూ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్ ప్రాథమిక విద్యాబ్యాసం అనంతసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిండాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు ఎంపిక చేశారు. అందులో శ్యామ్ ప్రసాద్ ఒకరు. దీనికోసం భువనగిరిలో కోచ్ శేఖర్‌బాబు వద్ద 15 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2014లో 25 రోజుల పాటు 20 మంది విద్యార్థులతో కలిసి హిమాలయ పర్వతాన్ని అదిరోహించాడు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన మలావత్ పూర్ణ హిమాలయ పర్వతాలు అధిరోహించిన సభ్యుల్లో శ్యామ్‌ప్రసాద్ కూడా సభ్యుడిగా ఉన్నడు. దాతలు సహకరించాలి హిమాలయ పర్వతాలు అధిరోహించిన స్ఫూర్తితో ప్రపంచంలోనే రెండో ఎత్తైన సౌతాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యాం ప్రసాద్ ఎంపికయ్యాడు. కిలీమంజారో వెళ్లడానికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు కూలీలు కావడంతో వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ నెల 25వ తేదీ వరకు చెల్లించాలి. లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుందని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తే జిల్లా పేరును ప్రపంచస్థాయిలో నిలబెడతానని విద్యార్థి శ్యాం ప్రసాద్ పేర్కంటున్నాడు. -
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
-
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా ఫొగట్ , మాలావత్ పూర్ణ, లైఫ్ టైం అవార్డును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అందుకున్నారు. వసుదైక కుటుంబం అనేది మన మార్గం కావాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాగృతి అంటే చైతన్యమని... ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభినందనలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌కు 110 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపిచంద్, మలావత్ పూర్ణ, రెజ్లర్ బబితా పోగట్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై వక్తలు చర్చించారు. రెండేళ్లకొకసారి ఇంటర్నేషన్ సమ్మిట్ ఏర్పాటు చేసి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేలా ముందడుగు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. -
వెండితెరపై మన పూర్ణ
⇒ ఎవరెస్టు అధిరోహించిన పూర్ణపై బాలీవుడ్ సినిమా ⇒ తెలంగాణ అమ్మాయిపై హిందీలో తొలి బయోపిక్ ఇదే ⇒ ప్రపంచవ్యాప్తంగా మార్చి 31న విడుదల ⇒ ట్రైలర్‌కు విశేషాదరణ.. 3.6 లక్షల మందికి పైగా వీక్షణ సాక్షి, హైదరాబాద్: మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి పద్నాగేళ్లలోపే ఎవరెస్టు ఎక్కి ప్రపంచ రికార్డు సృషించిన తెలంగాణ అమ్మాయి. తాజాగా ఆమె జీవిత చరిత్ర వెండితెరకెక్కుతోంది. అది కూడా హిందీలో! ఓ తెలంగాణ అమ్మాయి జీవితంపై బాలీవుడ్ స్థాయిలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘పూర్ణ’పేరుతో వస్తున్న ఈ సినిమా మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పూర్ణ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్‌ఫస్టియర్ చదువుతోంది. ఆమె తల్లి లక్ష్మి, తండ్రి దేవదాస్ వ్యవసాయ కూలీలు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం కావడంతో తల్లిదండ్రులు పూర్ణను తాడ్వాయి గురుకుల పాఠశాలలో చేర్పించారు. పర్వతారోహణపై పూర్ణ ఆసక్తి చూసి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మరో విద్యార్థి ఆనంద్‌తో కలిసి పూర్ణ 2014 మే 25న ఎవరెస్టును అధిరోహించింది. బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, నిర్మాత రాహుల్ బోస్ పూర్ణ సాహస యాత్ర గురించి తెలుసుకుని దీన్ని సినిమాగా మలిచారు. పూర్ణగా హైదరాబాద్ విద్యానగర్ అరవింద ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అదితి ఇనాందార్ నటించింది. మహేంద్రహిల్స్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఆమె స్నేహితులుగా నటించారు. ఆర్నెల్ల పాటు చిత్ర నిర్మాణం సాగింది. 5 రోజల క్రితం విడుదలైన ట్రైలర్‌ను ఇప్పటికే 3.6 లక్షల మంది వీక్షించారు. పూర్ణ జీవితంపై ఏకంగా బాలీవుడ్లో సినిమా రానుండటం గొప్ప విషయమని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ శ్రద్ధ వల్ల గురుకుల పాఠశాలల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రవేశాలకు భారీ పోటీ నెలకొంది. ఈ సమయంలో వస్తున్న పూర్ణ సినిమాతో తెలంగాణ గురుకులాల ప్రతిష్ట దేశమంతటికీ తెలుస్తుంది’’అని అభిప్రాయపడ్డారు. 'పూర్ణ' ట్రైలర్..