మలేషియా భక్తుడి బంగారం చోరీ
శ్రీకాళహస్తిః శ్రీకాళహస్తి ఆలయంలో మలేషియాకు చెందిన భక్తుడి బంగారు ఆభరణం చోరీకి గురైంది. శ్రీకాళహస్తి దేవస్థానంలో మలేషియాకు చెందిన కలెసైల్వన్ తన భార్యతో కలసి మంగళవారం రాత్రి దర్శనానికి విచ్చేశారు. స్వామి దర్శనాంతరం అమ్మవారి దర్శనం చేసుకునే క్యూలో కలెసైల్వన్కు చెందిన 48 గ్రాముల బ్రాస్లైట్ చోరీకి గురైంది. దీంతో ఆయన ఆలయ చైర్మన్ గురవయ్యనాయుడుకు, వన్‌టౌన్ సీఐ చిన్నగోవింద్కు ఫిర్యాదు చేశారు. ‘సార్ దిస్ ఈస్ టూ బ్యాడ్’ అంటూ మలేషియా భక్తుడు ఆలయ చైర్మన్ గురవయ్యనాయుడు, వన్‌టౌన్ సీఐ చిన్నగోవింద్ వద్ద ఆవేదన చెందారు.
విచారణ చేసి న్యాయుం చేస్తామని సీఐ వారి వివరాలు తీసుకుని పంపించారు. తర్వాత సీఐ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించావుని.. క్యూలో కిందిపడిన బ్రాస్లైట్ను ఓ వ్యక్తి తీసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది స్పష్టంగా తెలియడం లేదన్నారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.