ప్రాణాలు కాపాడిన 'రుద్ర' గావుకేక
పూణే : విపత్కర పరిస్థితుల్లో మధ్య మాలిన్ గ్రామంలో శిథిలాలు తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇంతలో శిథిలాల మధ్య నుంచి ఓ చిన్నారి గావుకేక! కొండచరియల మధ్య చిక్కుకొని మూర్చపోయిన తల్లి ఒడిలో ఉన్న మూడు నెలల పసికందు రుద్ర బిగ్గరగా ఏడ్చింది.. దాంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది తల్లి, బిడ్డను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
కొండచరియలు విరిగిపడటం రుద్ర తల్లి ప్రమీలా లింబే ఇల్లు శిథిలాల కింద సమాధి అయింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె ఓ ఇనుప డబ్బాలో బిడ్డతోపాటు తలదాచుకున్నారు. శిథిలాల మధ్య ఇరుక్కుపోయి సాయం కోసం అరిచి..అరిచి ఆమె మూర్ఛపోగా ఆమె ఒడిలో చిన్నారి పెట్టిన గావుకేకతో.. తల్లిబిడ్డల ప్రాణాలు దక్కాయి.
వారిద్దరూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆ డబ్బాలోనే ఉండిపోయారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతసేపు డబ్బాలో ఉండి వారిద్దరూ ప్రాణాలతో బటయపడటం అద్భుతమే మరి.