మామునూర్ ‘వెటర్నరీ’కి 138 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్లోని మామునూర్ వెటర్నరీ సైన్స్ కాలేజీకి 100 రెగ్యులర్ పోస్టులు, 38 ఔట్సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 79 మంది బోధన సిబ్బంది, 21 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక అసోసియేట్ డీన్తోపాటు 17 మంది ప్రొఫెసర్లు, 23 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 2 సూపరింటెండెంట్, 3 సీనియర్ అసిస్టెంట్, 2 ఫార్మ్ మేనేజర్, క్యాషియర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులున్నాయి.