స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి యువకుడి మృతి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతిచెందాడు. యాకుత్‌పురా ఇమామ్‌బడా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అసద్ ఖాన్ కుమారుడు మహ్మద్ రిజ్వాన్ (19) కిరాణా షాపులో పని చేస్తున్నాడు.
కొద్ది రోజులుగా ఈత కొట్టేందుకు సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌ఫూల్‌కు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం మదీనానగర్‌లోని స్విమ్మింగ్‌పూల్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ఫూల్లోకి దూకగా ప్రమాదవశాత్తు తలకు దెబ్బ తగిలి అందులో పడిపోయాడు. స్నేహితులు వెంటనే బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రెయిన్‌బజార్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.