ప్రేమంటే ఫీలింగ్ కాదు...
ప్రేమంటే ఫీలింగ్ కాదు... అది ఎథిక్స్‌తో కూడిన విషయం అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మనసు పడిన కథ’. ఈ చిత్రం ద్వారా అరవింద్ హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక్ ప్రత్యేక పాత్రధారి. రాజేష్ మందపాటి దర్శకుడు. హనితా రాహుల్ చౌదరి, గాదె భానుప్రకాష్ నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. సందేశంతో కూడిన వినోదాత్మక ప్రేమకథ తెరకెక్కించాలనే తన అభిమతానికి అనుగుణంగా దర్శకుడు చక్కని కథ వినిపించాడని సమర్పకుడు జేఎల్వీ ప్రసాద్ చెప్పారు. రొమాంటిక్ లవ్‌స్టోరితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత అన్నారు. రెండేళ్లు ఈ కథ మీద వర్క్ చేశానని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌కుమార్, సంగీతం: హరినికేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్‌శర్మ.