‘శాంతి మానవత ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ(గాంధీనగర్) :
జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘శాంతి మానవత ఉద్యమం’ వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాంతి, మానవతా ఉద్యమాన్ని ఆగస్టు 21న ప్రారంభించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉద్యమంలో భాగంగా వివిధ మత, సామాజిక వర్గాల సభ్యులతో గ్రామ స్థాయి వరకు ‘సద్బావనా’ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో శాంతి మానవతా ఉద్యమం కన్వీనర్ ముహమ్మద్ అక్బర్ బాషా, జమాఅతె ఇస్లామీ హింద్ బాధ్యులు అబ్దుల్ ఖదీర్, ముజాహిద్ ఉమ్రి, మహెబూబ్ జానీ, కె ఎం ఖాన్, పింకిసింగ్, పి రాజశేఖర్, జయరాజ్, ఫారూఖ్ షుబ్లీ, మునీర్ అహ్మద్, సయ్యద్ రషీద్, ముహ్మద్ అలి పాల్గొన్నారు.