తెనాలిలో వ్యక్తి దారుణ హత్య
తెనాలి(గుంటూరు జిల్లా): తెనాలి మండలం కఠెవరం గ్రామంలో మంచాల శ్రీశ్రీ(50)అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు.
వివరాలు..శ్రీశ్రీ ఇంటి పక్కనే వెంకట్ రెడ్డి నివాసముంటున్నాడు. ఆర్మీలో పని చేసే వెంకట్ రెడ్డి బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీశ్రీ భార్యకు వెంకట్ రెడ్డి భార్యకు కొంతకాలంగా చిన్నచిన్న తగాదాలు జరుగుతున్నాయి. ఓ విషయంలో మంగళవారం కూడా రెండు కుటుంబాలు తగువులాడుకున్నాయి. వెంకట్ రెడ్డి బుధవారం ఉదయం కోపంతో శ్రీశ్రీని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రగాయాలైన శ్రీశ్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.