'అనంత' క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరుగలేదు
అనంతపురం: అనంతపురం క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాంచూ ఫెర్రర్ తెలిపారు. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రా క్రికెట్ సంఘం నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థ నగదు కూడా వెచ్చిస్తున్నామన్నారు. త్వరలో మరో ఐదుగురు మహిళలను సభ్యులుగా తీసుకుంటామని మాంచూ ఫెర్రర్ చెప్పారు.