పిల్లలు పుట్టడం లేదని...
నాగోలు: పిల్లలు పుట్టడం లేదని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన మందసాని రాజ్యం (30) బ్రహ్మయ్యలు భార్యాభర్తలు. వీరికి 14 సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. 10 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి మన్సూరాబాద్ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసముంటున్నాడు. వివాహమైన కొత్తలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. అప్పటి నుంచి పిల్లలు పుట్టకపోవడంతో రాజ్యం తీవ్ర మనస్తాపానికి గురైంది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం భర్త బ్రహ్మయ్య సింగరాయకొండలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు వెళ్లాడు. కాకతీయ కాలనీలో నివాసముండే బాబాయ్ ఇంటికి రాజ్యం శుక్రవారం వచ్చింది. ఇంటికి వెళ్లి తిరిగి వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం బంధువులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.