mangala
-
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్‌లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
టీబీజెడ్‌లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
బెళగావి లోక్‌సభ సీటు బీజేపీ కైవసం
న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కర్ణాటకలో బెళగావి లోక్‌సభ స్థానంలో దివంగత కేంద్రమంత్రి సురేష్ అంగడి భార్య, బీజేపీ అభ్యర్థి అయిన మంగళ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. కేరళలో మళప్పురం లోక్‌సభ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అయిన అబ్దుస్సమాద్ సమాదాని గెలిచారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ కంటే కాంగ్రెస్ నేత విజయ్ వసంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, కర్ణాటకలోని బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర గెలిచారు. మస్కిలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తురివనహాల్ గెలిచారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 2 చోట్ల, మరో చోట బీజేపీ గెలిచాయి. గుజరాత్లో మర్వా హదాప్ స్థానంలో బీజేపీ నేత నిమిషా సత్తార్ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్ గెలిచారు. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ నేత నోముల భగత్ గెలిచారు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో జేఎఎం అభ్యర్థి హఫీజుల్ విజయం సాధించారు. -
ఇక నాకు దిష్టి తగలదు
కొంతమంది పైకి మోడ్రన్‌గా కనిపించినా లోలోపల మాత్రం చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. చార్మి అలాంటి అమ్మాయే. సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా దాదాపు మోడ్రన్ దుస్తుల్లో కనిపించే చార్మి పండగలు, పూజలకు మాత్రం సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరిస్తారు. ఇక, పూజలు, పునస్కారాల గురించి చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడు గుడికెళ్తారు.. లేనప్పుడు ఇంట్లోనే పూజలు చేసుకుంటారామె. దాదాపు మూడు నెలల క్రితం వికారాబాద్‌లోని శివుడి గుడికెళ్లారు చార్మి. ‘మంగళ’ సినిమాకి నంది అవార్డు వస్తే, గుడికొస్తానని మొక్కుకున్నారట. ఆ మొక్కుని తీర్చేసుకున్నారు. మరి.. ప్రస్తుతం ఏం మొక్కుకున్నారో ఏమో కానీ ఇంట్లో, అఖండ పూజ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 48 గంటల పాటు నిరాటంకంగా ‘గురుగ్రంథ్‌సాహిబ్’ చదువుతామని చార్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. గురుగ్రంథ్‌సాహిబ్ అంటే.. సిక్కుల పవిత్ర గ్రంథం. ఈ అఖండ పూజ మాత్రమే కాదు.. దిష్టి తగలకుండా చేతికి రెండు పూసల గాజులు ధరించారు చార్మి. తననెంతో అభిమానించే వ్యక్తి వీటిని బహుమతిగా ఇచ్చారని, ఇక దిష్టి తగిలే ప్రసక్తే లేదని చార్మి తెలిపారు. అంతగా అభిమానం కనబర్చిన ఆ వ్యక్తి ఆడా, మగా అనేది మాత్రం స్పష్టం చేయలేదు ఈ బ్యూటీ.