Manish Sharma Director
-
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
ముప్పై కోట్ల ఫైట్
‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ 3’. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు ‘టైగర్ 3’లోనూ జంటగా నటిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చో్ప్రాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం ఈ నెల 8 నుంచి ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో షారుక్ ఖాన్ గెస్ట్‌గా కనిపిస్తారు. ఈ ఒక్క ఫైట్ కోసమే నిర్మాత ఆదిత్యా చో్ప్రాదాదాపు రూ. 30 కోట్లు కేటాయించారని, జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని బాలీవుడ్ టాక్. ‘టైగర్ 3’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
జయేష్ భాయ్
బాలీవుడ్లో విభిన్న పాత్రలు చేయడానికి ముందుంటారు రణ్వీర్ సింగ్. లేటెస్ట్గా మరో విభిన్న పాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో రణ్వీర్ గుజరాతీ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. యశ్‌రాజ్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా దివ్యాన్గ్ థక్కర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘‘నా కెరీర్లో అద్భుతమైన దర్శకులతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటివరకూ నా విజయాలన్నీ వాళ్లకే అంకితం ఇస్తున్నాను. దివ్యాన్గ్ థక్కర్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. చక్కటి కథకు దివ్యాన్గ్ హాస్యం జోడించారు’’ అన్నారు. ‘‘కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. కమర్షియల్ పంథాలో నడిచే ఓ ప్రయోజనాత్మక చిత్రం తీస్తున్నాం’’ అన్నారు నిర్మాత మనీష్ శర్మ. ఇదిలా ఉంటే ప్రస్తుతం 1983 ప్రపంచకప్ కథ ఆధారంగా రూపొందుతున్న ‘83’ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ చేస్తున్నారు. ∙రణ్వీర్ సింగ్