టెన్త్ సైన్స్, సోషల్ పరీక్ష 11 గంటలకు
హైదరాబాద్: పదో తరగతి సామాన్య శాస్త్రం(సైన్స్), సాంఘిక శాస్త్రం(సోషల్) పరీక్ష జరిగే వేళలను సవరించారు. సైన్స్, సోషల్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి కాకుండా 11 గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి బుధవారం తెలిపారు. గతంలో సైన్స్ పేపర్-1, సోషల్ పేపర్-1 పరీక్షలనే ఉదయం 11 గంటల నుంచి జరపాలని నిర్ణయించిన విషయం తెలిసింది.
అయితే కొన్ని పరీక్షలను 9.30 నుంచి మరికొన్ని పరీక్షలను 11 గంటల నుంచి ప్రారంభిస్తే విద్యార్థులు ఆయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో 7నుంచి జరిగే అన్ని పరీక్షలు(సైన్స్ రెండు పేపర్లు, సోషల్ రెండు పేపర్లు) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. 3, 4 తేదీల్లో మేథమేటిక్స్ పేపర్-1, మేథమేటిక్స్ పేపర్-2 పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకే ప్రారంభం అవుతాయి