ఓ ప్రశ్నకు సమాధానం రాయలేకపోయా!
♦ స్లిప్ టెస్టులో ఐదు మార్కులు పోయాయి..
♦ స్కూల్ టాపర్ కాలేనన్న బాధతో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మార్కుల రేసు మరొక విద్యార్థి ఉసురు తీసింది. స్లిప్ టెస్టులో ఓ ఐదు మార్కుల ప్రశ్నకు సమాధానం రాయలేకపోయానని, టాపర్‌గా ఉన్న తాను కింది స్థాయికి పడిపోతానన్న మనస్థాపంతో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఘటన మారేడుపల్లిలో చోటుచేసుకుంది. వివరాలను సీఐ అప్పల నాయుడు శుక్రవారం తెలిపారు. మారేడుపల్లి కృష్ణపురి కాలనీలో ఉంటున్న వెంకటేశ్, జ్యోత్స్నల కుమారుడు మణినేహాల్ (13) రెజిమెంటల్‌బజార్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళ వారం స్కూల్లో నిర్వహించిన వీక్లీ టెస్ట్‌లో ఒక ప్రశ్నకు సమాధానం రాయలేక పోయాడు.
క్లాస్‌లో టాపర్ గా ఉన్న తాను కింది స్థాయికి పడిపోతానంటూ అక్కతో బాధను పంచుకున్నాడు. రెండ్రోజులుగా తీవ్ర మనస్థా పంతో ఉన్న నేహాల్... గురువారం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. బయ టకు వెళ్లిన తల్లి, అక్క ఇంటికి చేరుకున్నారు. నేహాల్ ఎంతకీ పలకకపోవడంతో వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా నేహాల్ ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. వెంటనే యశోదా ఆసుపత్రికి తరలించగా.. అప్ప టికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
సున్నిత మనస్కుడు...
దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వ హించి, కుటుంబ సభ్యులకు అందించారు. నేహా ల్ మృతదేహాన్ని చూసి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. క్లాస్‌లో ఎప్పుడూ టాప్‌లో ఉండేవాడని, దైవభక్తి ఎక్కు వని, సున్నిత మనస్కుడని స్నేహితులు చెప్పారు.