Manoj Kumar Jain
-
శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్కమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాత ఒకేసారిగా లేదా ఏటా కొంత మొత్తం చొప్పున గ్యారంటీ ఇన్కమ్ అందుకునే విధంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఇది ఒక విధంగా పెన్షన్ ప్లాన్ కింద పని చేసేదే అయినా... 30 ఏళ్లు దాటిన వారికి కూడా ఏటా హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. పాలసీకి 8 లేదా 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వార్షిక ప్రీమియానికి గరిష్టంగా 10 రెట్లు బీమా రక్షణ లభిస్తుంది. ఈ పాలసీని 30 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 50 ఏళ్ల వారి వరకు తీసుకోవచ్చు. వచ్చే మూడు నెలల కాలంలో 10,000 అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్స్‌ను విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల ప్రీమియం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. -
కెన్యా కాల్పుల్లో భారతీయ బాలుడు మృతి
కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ మాల్‌పై తీవ్రవాదుల దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పరాంశ్జైన్ మరణించాడని అతడి బంధువులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. ఆ ఘటనలో పరాంశ్ తల్లి ముక్తా, సోదరి పూర్వీలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆ ఘటన తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మనోజ్ కుటుంబంతో పాటు షాపింగ్‌మాల్‌కు వెళ్లిన బ్యాంక్ ఉద్యోగి మరణించిందని, వారి కారు డ్రైవర్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని చెప్పారు. పరాంశ్ జైన్ తండ్రి మనోజ్ కుమార్ జైన్ నైరోబీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బుందేల్‌ఖండ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన వారి కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం ఇండోర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి నైరోబీలోని బరోడా శాఖకు బదిలీపై వెళ్లారని చెప్పారు. గత రెండునెలల క్రితమే మనోజ్ కుమార్‌కు పదోన్నతి లభించిందన్నారు.