శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వీ రాముడు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ కుమార్ సిన్హా కూడా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.