ఏసీసీ ఎమర్జింగ్ కప్ ఫైనల్‌కి
సింగపూర్: బ్యాటింగ్‌లో మన్‌ప్రీత్ జునేజా (76), బౌలిం గ్లో అక్షర్ పటేల్ (4/29) చెలరేగడంతో... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ టోర్నీలో భారత్ అండర్-23 జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం కళింగ మైదానంలో జరిగిన సెమీఫైనల్లో 46 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
లోకేష్ రాహుల్ (43) రాణించాడు. యూఏఈ స్పిన్నర్ నాజిర్ అజీజ్ ఐదు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 48.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై ఓడింది. అన్వర్ (44) టాప్ స్కోరర్. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ 4, సందీప్ శర్మ, అపరాజిత్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్.. పాక్‌తో తలపడుతుంది. రెండో సెమీస్‌లో పాక్ ఒక వికెట్ తేడాతో శ్రీలంకను ఓడించింది.