Mansa
-
సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
చండీగఢ్: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్, అజర్బైజాన్లో సచిన్ తాపన్ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది. చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర -
28 ఏళ్లకే కొడుకును విగ్రహంగా చూసి తండ్రి కన్నీటి పర్యంతం
చండీగఢ్: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్కౌర్ సింగ్ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు. Sidhu Moosewala’s parents got emotional while they were installing statue of their son where he got cremated #SidhuMooseWala pic.twitter.com/4qdlmXGWKn — Gagandeep Singh (@Gagan4344) July 17, 2022 విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు. మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది.
పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది. పెళ్లి కూతురుకు చెందిన మూడు నక్లెస్‌లను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాల కళ్యాణ మండపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక కళ్యాణమండపంలోకర్ణాటక కొల్లగల్కు చెందిన మానసకు హిందూపురానికి చెందిన అక్షిత్‌తో బుధవారం తెల్లవారుజామున పెళ్లి జరగనుంది. దీనికోసం బందువులంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు పెద్దమ్మ రాధ తన వెంట తెచ్చిన మూడు నక్లెస్‌లను గదిలో పెట్టి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగలు ఎత్తుకె ళ్లారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గత వారం ఇదే కుటుంబానికి చెందిన మరో వివాహవేడుకలో కూడా 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురవడం గమనార్హం.