కాంస్యం నెగ్గిన మాన్సి
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఏకైక కాంస్య పతకం లభించింది. నాన్ ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. అల్బేనియా రాజధాని టిరానాలో ముగిసిన ఈ టోర్నీలో మహిళల ఫ్రీస్టయిల్ 59 కేజీల విభాగంలో మాన్సి అహ్లావత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.కాంస్య పతక బౌట్లో మాన్సి 5–0తో కెనడా రెజ్లర్ లారెన్స్ బ్యూరెగార్డ్‌ను ఓడించింది. సెమీఫైనల్లో మాన్సి 1–4తో సుఖీ సెరెన్చిమెడ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది. 65 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో మనీషా భన్వాలా 2–8తో మివా మొరికావా (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. బోపన్న జోడీ ఓటమి పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం కథ ముగిసింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–7 (13/15), 5–7తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది.