‘భద్రాద్రి’ ప్లాంట్ కు పచ్చజెండా
పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు- పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రా ద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) స్థానిక ప్రజలు పచ్చజెండా ఊపారు. పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ఉప్పాక సీతారాంపురంలో పోలీసు పహరా నడుమ జరి గింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండడంతో దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు వద్ద 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్, పాల్వంచలో 7వ దశ కింద కేటీపీఎస్ లో 800 మెగావాట్లు, నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతి
సబ్ క్రిటికల్ టెక్నాలజీ బదులు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతిలో ప్లాంట్ నిర్మించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు సూచించారు. కాలుష్యం నియంత్రణకు రూ.29 కోట్లు, ఏటా లాభాల్లో 2 శాతం ఖర్చు చేస్తామని జెన్కో సీఎండీ చెప్పారు. దీంతో ప్లాంట్ నిర్మాణానికి అన్నివర్గాల నుంచి సుముఖత వ్యక్తమైంది. 5 నెలలపాటు పనులు చేసిన తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహించడంతో పనులను జెన్కో నిలిపేసిన విషయం తెలిసిందే. చివరకు ప్రజాభిప్రాయ సేకరణలో సానుకూల ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకుంది.