Maracana Stadium
-
ఒలింపిక్స్ వేదిక సమీపంలో ఇద్దరి కాల్చివేత
రియో డి జనీరో: ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చిన మారకానా స్టేడియం సమీపంలో శుక్రవారం ఓ దొంగను పోలీసులు కాల్చిచంపారు. మరో వేదిక దగ్గర 51 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మారకానా స్టేడియం వద్ద దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తిని ఓ పోలీసు అధికారి అడ్డగించి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. దీనికి కొన్ని గంటల ముందు ఒలింపిక్ జ్యోతి ఉన్న ప్రాంతానికి కారులో వెళ్తున్న మహిళపై ముగ్గురు దొంగలు దాడిచేసి తుపాకులతో కాల్చి చంపారు. పోటీలు జరిగే వివిధ వేదికల్లో సుమారు 85 వేల మంది సైనికులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. పురుషుల సైక్లింగ్ రేసు ముగిసే కోపాకాబానా సమీపంలో బ్రెజిల్ మిలిటరీ ఆధ్వర్యంలో ఓ బాంబును నిర్వీర్యం చేశారు. నిపుణుల సమక్షంలో దీన్ని పేల్చివే శారు. ఆ సమయంలో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచారు. -
ఒలింపిక్ క్రీడా గ్రామం ప్రారంభం
రియో డి జనీరో: బ్రెజిల్లో ఒలింపిక్స్ సందడి ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కాబోతుండగా తాజాగా ఒలింపిక్స్ అథ్లెట్స్ గ్రామాన్ని అధికారికంగా తెరిచారు. అత్యంత అధునాతనంగా నిర్మించిన ఈ క్రీడా గ్రామం 10,500 మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బందికి వసతి కల్పించనుంది. 31 భవన సముదాయాలతో కూడిన ఈ గ్రామంలో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, ఏడు స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్తో పాటు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక భోజనశాలలో ప్రపంచంలోని ఏ వంటకమైనా అథ్లెట్లకు రుచి చూపించేందుకు సిద్ధం చేశారు. దీంట్లో రోజుకు 60 వేల భోజనాలను వడ్డించనున్నారు.