సెకండ్ ఇన్నింగ్స్!
తెలుగులో ఓ వెలుగు వెలిగి... బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నట్టుంది. అయితే తెలుగులో కాదు... తన భర్త బిజీగా ఉన్న మరాఠీ స్క్రీన్‌పై! ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో గ్లామరస్‌గా కనిపించిన జెనీ... బాలీవుడ్లో తన రీ ఎంట్రీ గురించి చెబుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు భిన్నంగా అమ్మడు... ‘ఇన్నాళ్లూ ఇంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేశాను. స్క్రిప్ట్స్ చూసి చాలా కాలమైంది.
ప్రస్తుతానికైతే ఏ సినిమాకీ సైన్ చెయ్యలేదు. అయితే మరాఠీ చిత్రంలో నటించడమంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. రితేష్ అప్‌కమింగ్ వెంచర్లో జెనీలియా లీడ్ రోల్ చేయనుందనేది సమాచారం. రితేష్ గత చిత్రం ‘లాయ్ భారీ’లో ఈ చిన్నది హోలీ సాంగ్‌లో కనిపించి మురిపించింది.