మరో కశ్మీరీ రచయిత..
జమ్ము: మతసామరస్యం, గోమాంసం సహా పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగిస్తున్న రచయితల జాబితాలో మరో కశ్మీరీ రచయిత చేరారు.
ప్రముఖ అధ్యాపకుడు, రచయిత మర్గూబ్ బన్హాలీ సోమవారం తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. కశ్మీర్ లో 20 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ హత్య, హర్యానాలో గోవులను తరలిస్తున్నారంటూ వ్యక్తిని కొట్టిచంపిన ఘటనలను నిరసిస్తూ అవార్డును వదులుకుంటున్నట్లు మర్గూబ్ తెలిపారు. విఖ్యాత కశ్మీరీ కవి గులాం నబీ ఖయాల్ ఇదివరకే తన సాహిత్య అవార్డును తిరిగిచ్చేశారు.