Marks Weightage
-
పీజీ మెడికల్‌లో ‘ఇన్ సర్వీస్’ రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్ : పీజీ మెడికల్ డిగ్రీ కోర్సులో ఇన్ సర్వీస్ కోటా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. భారత వైద్య మండలి (ఎంసీఏ) నిబంధన 9(4) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వారు ఇకపై వెయిటేజీ మార్కులు మాత్రమే పొందాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఇన్ సర్వీస్ కోటా రద్దు చేసి దాని స్థానే వెయిటేజీ మార్కులిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని సోమవారం తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే రాష్ట్ర కోటా కింద ఉన్న 50 శాతం సీట్లలో రిజర్వేషన్లు పొందడానికి పిటిషనర్లు అర్హులని పేర్కొంటూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇన్ సర్వీస్‌లోని వైద్యులు గరిష్టంగా గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ల వైద్య సేవలు అందిస్తేనే వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులంటూ తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న పేరాను హైకోర్టు తప్పుపట్టింది. జీవోలోని ఆ విభాగాన్ని ధర్మాసనం రద్దు చేస్తూ.. ఏడాది, రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వైద్యులూ పీజీ మెడికల్ అడ్మిషన్లలో వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. -
సమ్మేటివ్–1లో తప్పులకు మార్కులు
శ్రీకాకుళం: సమ్మేటివ్–1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు మార్కులు కలపాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీకి అందిన ఫిర్యాదు మేరకు ప్రశ్నపత్రాలను పరిశీలించారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా మార్కులు కలిపేలా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఎస్సీఈఆర్టీ నుంచి ఉత్తర్వులు అందాయి. మార్కులు కలిసేవి ఇవే... –6వ తరగతి ఇంగ్లిష్‌లో 10, 11సి(2) ప్రశ్నకు, గణితంలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి. – 8వ తరగతిలో గణితంలో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి. – 10వ తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ హింట్స్ స్టోరీ సమ్మేటివ్–2 సిలబస్‌కు సంబంధించినది. గణితం–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి. సమ్మేటివ్–2 సిలబస్ విడుదల సమ్మేటివ్–2 సిలబస్‌ను స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చి ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు.