సమ్మేటివ్‌–1లో తప్పులకు మార్కులు | marks for mistakes | Sakshi
Sakshi News home page

సమ్మేటివ్‌–1లో తప్పులకు మార్కులు

Published Fri, Oct 7 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

సమ్మేటివ్‌–1లో తప్పులకు మార్కులు

సమ్మేటివ్‌–1లో తప్పులకు మార్కులు

శ్రీకాకుళం: సమ్మేటివ్‌–1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు మార్కులు కలపాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్‌సీఈఆర్‌టీకి అందిన ఫిర్యాదు మేరకు ప్రశ్నపత్రాలను పరిశీలించారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా మార్కులు కలిపేలా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ఉత్తర్వులు అందాయి.


మార్కులు కలిసేవి ఇవే...
–6వ తరగతి ఇంగ్లిష్‌లో 10, 11సి(2) ప్రశ్నకు, గణితంలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి.
– 8వ తరగతిలో గణితంలో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి.
– 10వ తరగతి ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్‌ స్కెచ్‌ అండ్‌ హింట్స్‌ స్టోరీ సమ్మేటివ్‌–2 సిలబస్‌కు సంబంధించినది. గణితం–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్‌–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి.
 

సమ్మేటివ్‌–2 సిలబస్‌ విడుదల
సమ్మేటివ్‌–2 సిలబస్‌ను స్టేట్‌ కౌన్సిల్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement