summative exam
-
సమ్మేటివ్–1లో తప్పులకు మార్కులు
శ్రీకాకుళం: సమ్మేటివ్–1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు మార్కులు కలపాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీకి అందిన ఫిర్యాదు మేరకు ప్రశ్నపత్రాలను పరిశీలించారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా మార్కులు కలిపేలా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఎస్సీఈఆర్టీ నుంచి ఉత్తర్వులు అందాయి. మార్కులు కలిసేవి ఇవే... –6వ తరగతి ఇంగ్లిష్‌లో 10, 11సి(2) ప్రశ్నకు, గణితంలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి. – 8వ తరగతిలో గణితంలో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి. – 10వ తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ హింట్స్ స్టోరీ సమ్మేటివ్–2 సిలబస్‌కు సంబంధించినది. గణితం–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి. సమ్మేటివ్–2 సిలబస్ విడుదల సమ్మేటివ్–2 సిలబస్‌ను స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చి ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు. -
సమ్మేటివ్-1లో తప్పులకు మార్కులు
ఒంగోలు : సమ్మేటివ్-1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడంతో వాటికి మార్కులను కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీకి తప్పులు దొర్లాయంటూ అందిన సమాచారం మేరకు వాటిని పరిశీలించి విద్యార్థులకు మార్కులు కలిపేందుకు నిర్ణయించారు. తరగతులు వారీగా, సబ్జెక్టుల వారీగా వీటికి మార్కులను కలిపేలా ఉపాధ్యాయులకు సూచించాలని ఎస్సీఈఆర్టీ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సూచించింది. ► 6వ తరగతి ఇంగ్లీషులో 10, 11సి(2) ప్రశ్న స్పష్టంగా లేదని దానికి మార్కులు కలపనున్నారు. లెక్కలు పరీక్షలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి. ► 8వ తరగతిలో లెక్కలులో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి. ► 10వ తరగతి ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ హింట్స్ స్టోరీ సమ్మేటివ్–2 సిలబస్‌కు సంబంధించినది. లెక్కలు–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి. సమ్మేటివ్–2 సిలబస్ విడుదల సమ్మేటివ్–2 సిలబస్‌ను స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చి ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయి, 70 శాతం ప్రశ్నలను ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు.