నెలరోజుల్లో క్వార్టర్ ఖాళీ చేయండి: హైకోర్టు
హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు చెందిన భవనంలో రెండేళ్ల నుంచి అనధికారికంగా ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సంస్థకు సంబంధించిన డీజీ క్వార్టర్‌ను 2013లో ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. 2014 ఫిబ్రవరిలో ఆయన ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు.
ఎన్నిసార్లు కోరినా ఆయన ఖాళీ చేయకపోవటంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం నెల రోజుల్లోగా నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించిందని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.